Thursday, February 22, 2007

తను

మనతోడు మన గోడు వింటే మనకు జోడు
లేదా గొంతు కోసే బ్లేడు, ఉరి తీసే తాడు

పెళ్ళి ప్రతి ఒక్కడి జీవితంలో ఒక పెద్ద మలుపు.
అన్ని నచ్చితే మిగిలేది వలపు, దక్కేది గెలుపు
లేకపోతే జీవనపంటలో మెదిలేది కలపు.

తన చెలిమి విరిసిన పూల వనం
తన లేమి ఓడిన రణం, చావని మరణం
తన రూపం గుడిలో ధూపం
తన హాసం ఆరని దీపం
తను లేని ఒక్క క్షణం, రగిలింది నా కణకణం,
కన్నుల్లొ ఆగని వరుణం, గుండెల్లొ నాటిన బాణం.

No comments: