Sunday, June 03, 2007

చీకటి...


నలువైపుల అలుముకున్న చీకటి నా కళ్ళకున్న పరదాను తొలిగించింది
నీళ్ళలో దీపంలా వెలిగే నీ రూపం కరిగిపొతుందన్న
భయంతో కన్నీళ్ళు కళ్ళలోనే ఇంకిపోయాయి.

దూరంగా చెట్లలోనుంచి వినిపిస్తున్న కోయిల రాగం
నీ పిలుపులా అనిపించి చెవులు తలుపులు తెరిచాయి

చంద్రుడు కురిపిస్తున్న చల్లటి వెన్నెల
నీ చూపుల మహిమలా అనిపించింది

పచ్చని ఆకుపైన మెరిసే నీటి ముత్యం
ఎర్రటి నీ బుగ్గన సొట్టలాగ కనిపించింది

ఇంతలో ఉత్సాహంగా ఉదయంచిన సూర్యుడు
నా అందమైన కలకు అంధకారం మిగిల్చాడు

చీకటి కోసం కలవరించే నా కళ్ళను తెరుస్తూ
కనుమరుగయ్యాను నేను...

No comments: