Tuesday, July 17, 2007

నిరీక్షణ..


చీకటి ముసిరిన నా కళ్ళకు నిన్ను చూడాలని

మూగబోయిన నా గొంతుకు నీ పేరు పలకాలని

చచ్చుబడ్డ నా కాళ్ళకు నీ నీడ వైపు నడవాలని

స్థంభించిన నా ఎదలయలో నీ రూపం కొలువవ్వాలని

అలలవంటి నా కలలకు నీ కన్నులు తీరం అవ్వాలని

నిస్తేజమైన నాకు నీ ఊపిరి ఉషస్సు నింపాలని

నిరాశ నిండిన నాకు నిశాంత సమయములో

నవ్వుల నీరజనాలు పలికే నీ కొసమే

నా నిరీక్షణ...

No comments: