నా అనుభవాల హస్తాక్షరి
ఈ డైరీ
నన్ను నేను కలుసుకొంటాను
ఇది తెరిచిన ప్రతీ సారి
ఒక పేజీలో నవ్వుతాను
ఒక పేజీలో నవ్విస్తాను
మరో పేజీలో
అమ్మ చేతి వంటను గుర్తు చేసుకొని కడుపు నింపుకున్న రోజులు
అమ్మాయి చేతికి తొడిగిన తొలి సంపాదన గాజులు
అనుమానాల అనలంలో నిజాల అన్వేషణకై దగ్ధమైన ఘడియలు
అనుభూతుల అంబరంలో అలుపెరుగక పైకెగిరిన అనందాల గాలిపటాలు
ఆవహించిన గమ్మత్తుల మత్తులు
ఆరాధించి హత్తుకున్న అందాల సొత్తులు
మధ్య మధ్యలో
నన్ను జాలిగా చూసే ఖాళి పేజీలు
కంటినిండా కడలి నింపే ఖాళి పేజీలు
ఖాళి పేజీ నిండా అవ్యక్తమైన ఆవేదనలు
అసంపుర్తిగా మిగిలిన ఆమోదించని వాదనలు
రేయిపగళ్ళ మధ్య సంధ్యా సమయంలా రేపటి పేజీ
రూపుదిద్దని రూపం కోసం డైరీ పెట్టే ఆరాటాల పేచీ.