Wednesday, July 16, 2008

నీ నవ్వు..


గదిలో
నాలో,
మదిలో,
గదిలాంటి నా మదిలో,
వినపడని సడిలో,
వర్షంలో తడిలో
కవ్వించే కలలో
కనిపించే ఇలలో
పైకెగిసిన అలలో
పరువంలో వలలో
పూసిన ప్రతి విరిలో
పండిన ప్రతి సిరిలో
పారిన ప్రతి ఝరిలో
చేరిన ప్రతి దరిలో
వినిపించే ప్రతి స్వరంలో
వేడుకొనే ప్రతి వరంలో
కోరికల ప్రతి శరంలో
కోసుకున్న ప్రతి నరంలో
ఏరులై పారిన ఎరుపులో
నిన్ను చేరాలనే నా పిలుపులో
ఎప్పటికి వీడని నీ తలపులో
ఎన్నటికి వాడని నా వలపులో
నీవు కావాలనే నాలో
వికసించే నీ నవ్వులు లోలో!!

No comments: