నిన్నటి నిర్లిప్తత
నేటితో జరిగిన కథ
నిన్నటి నిస్సత్తువ
నేటితో ముగిసిన వ్యథ
నిన్నటి నిస్తేజం
నేటితో ఆగిన రోద
నిన్నటి నీరవం
కొయిలై కూసిన సొద
నేటి ఈ నిషాంతం
నీకళ్ళలో వెలిగే సదా
నిన్నటి నీరెండలో
మన కలయిక సుందరకాండ
నేడు నివహగగనంలో
రెపరెపలాడెను నా వలపుల జెండ
నేడు ఊహల వర్షంతో
నా మది ఒక నిండిన కుండ
No comments:
Post a Comment