నీ ఙ్ఞాపకాల నిలయం ఈ గొడుగు
మండుటెండలొ చల్లని నీ తోడులో
వేసిన ప్రతి అడుగుకి
సాక్ష్యం ఈ గొడుగు
హోరు గాలికి ఊరుకొనక పోరు పెడుతున్న
నీ కురులను సవరించిన ఆ ఘడియకు
సాక్ష్యం ఈ గొడుగు
జడివానలో తడినుంచి తపననుంచి
దూరం కోసం తనువు పడ్డ వేదనకు
సాక్ష్యం ఈ గొడుగు
ఇప్పుడు నన్ను
నిజం చెప్పమని నిలదీసి మూలుగుతుంది
మూలన చేరిన ఈ గొడుగు...
ఎమని చెప్పను
ఎల చెప్పను!!
ఙ్ఞాపకాల బాధలో..
ఙ్ఞాపకాల భయంతో...
తన వెనకే నక్కి కూర్చున్నాను అని తెలియక..
నిన్నటి బాసలే మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది ఈ గొడుగు.
No comments:
Post a Comment