Wednesday, May 16, 2007

ఏకాకి...


జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె
సన్యాసం సూన్యం నావే
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్నిరంగుల్నీ
రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని !!జగమంత కుటుంబం !

మింటికి కంటిని నేనైకంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిషినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని !!జగమంత కుటుంబం !

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
!!జగమంత కుటుంబం !!



సిరివెన్నెల కలం నుంచి జాలువారిని మరో ఆణిముత్యం. సినిమాకు సంబంధించినంత వరకు, పాట సందర్భానుసారంగానే ఉంది. కాని ఈ పాట ప్రతి మనిషి జీవితానికి అద్దంపట్టేలా ఉంది. ప్రతి మనిషి తన జీవితంలో ఇలాంటి సమస్యను లేదా సందర్భాన్ని ఎదుర్కొంటాడు. ఒంటరితనం నేర్పే పాఠాలకు పరీక్షలు ఉండవు. ఆ ఒంటరితనం అనే ఓడను ఈ జీవనసాగరంలో, తోడు అనే తీరం వైపు నడిపించడమే మనిషి లక్ష్యం. కాని తీరం చేరిన దూరం కాని ఒంటరితనం చాలా మందిని వేధిస్తూనే ఉంతుంది. ఈ పాటలో వివరించింది ఇదే సమస్యను. అసలు ఈ ఒంటరితనం మనసుకా, మనిషికా? మనిషి ఒంటరితనం మనసు ఒంటరితనం అవుతుంది కాని, మనసు ఒంటరితనం మనిషి ఒంటరితనం కాకపొవచ్చు. మనిషికి దొరికిన తోడు మనసుకు తోడు కాకపొవచ్చు. ఇలా బాధపడే వాళ్ళు కోకొల్లలు. కాని ప్రస్తుత స్థితిగతులు అంత సమయాన్ని కేటాయించనివ్వవు.

సాహిత్యానికి సంబంధించినంత వరకు పాటలో ప్రతి వాక్యానికి కవి సరైన న్యాయం చేసారు. "వెన్నెల కూతల మంటను నేనై", వెన్నెల మనకు చల్లదనాన్ని ప్రసాదిస్తుంది కాని కవి ఇక్కడ చెప్పాలనుకొన్నది, ఆ వెన్నెల రాత్రులలో, ఒంటరితనంలో తోడు కోసం తను పడ్డ తపన, ఆ దయనీయ స్థితిలో తను పడ్డ బాధను "మంటగ" వివరించాడు. గమనించదగ్గ విషయం ఎంటంటే రెండు వ్యతిరేక పదాలతో ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడం. ఇలాంటి పదాలను Englishలో 'Oxymorons'అంటారు(తెలుగులో ఎమంటారో నాకు తెలియదు). ఇలాంటివే తెలుగులో కొన్ని "పగలే వెన్నెల", "హిమజ్వాల". కవి చివరి చరణంలో వాదిన ఒక పదం "సినీవాలి" , దీనికి అర్థం అమవాస్య చంద్రరేఖ. అమావాస్య చంద్రరేఖ ఉంటుందా, ఎమో నాకు తెలియదు. అమవాస్య చంద్రరేఖ ఆశావాదానికి ప్రతిరూపంగా కవి వాడాడు.
కవి చెప్పాలనుకొన్న భావం మనం అర్థం చేసుకొన్న భావం ఒకటే కాకపోవచ్చు. ఒక కవిత్వం కవి చూసే కోణంలో పాఠకుడు ఆలోచించకపోవచ్చు, అంతమాత్రాన పాఠకుడి అలోచనలు తప్పు కానవసరం లేదు, ఒకవేళ పాఠకుడి ఆలోచనలు అర్థవంతమైతే..

No comments: