అది సాయంత్రం
మళ్ళీ ప్రయాణం ప్రారంభించాను
అదే పాత రోడ్డుపైన
అదే పాత కారులోన
దారులన్ని సుపరిచితం
పలకరింపు కోరడమే అనుచితం
శీతాకాలం చలికి వణికాను
ఎండకాలం వేడికి మరిగాను
వానకాలం జడికి తడిసాను
కారుచీకటిలో దివ్వెనయ్యాను
కటిక అడవిలో లేడినయ్యాను
మారుతున్న ఋతువులకు సాక్ష్యంగా
మారని సేతువయ్యాను
రూపుమారిన బాటలో
రూటుమారని బాటసారయ్యాను
కాలం గడిచిన పరిచయం పెరగలేదు
గమ్యం తెలియని ప్రయాణం ఆగలేదు
(నేను గత రెండు ఏళ్ళుగా ఒకే దారిలో ప్రయాణిస్తున్నాను, ఒంటరిగా. ప్రతి అడుగు నాకు దగ్గరగానే అనిపిస్తుంది కాని, ఆ మార్గం ఎప్పుడు నన్ను పలకరించునట్టుగా అనిపించదు. ఫ్రతి సారి ఒక పరాయి వ్యక్తిని చూసినట్టుగ చూస్తుంది. నేను చేరాలనుకొన్న గమ్యం ఆ ప్రయాణంలో రాదు, నేను చేరుకొనే గమ్యం, గమ్యం కాదు. అయినా, ఈ ప్రయాణంతో నా ప్రణయం ఆగట్లేదు, ఈ ప్రణయంలో అంతఃప్రళయం తగ్గట్లేదు.)
1 comment:
Great Poetry.... Keep it up :)
Post a Comment