ఎకాంతపు కొలనులో ఒంటరిగ ఉన్న పువ్వును నేను
అలలు సృష్టించగ వచ్చిన గాలివి నువ్వు
రెక్కలు తెగిన వికారి తొడిమిలాగ మిగిలాను నేను
అలను సృష్టించి కలలాగ కనుమరుగయ్యావు నువ్వు.
చీకటిలో నడి రాతిరిలో నీ జతకై నేను
మెరుపులు మెరుస్తు వెలుగులు చిమ్ముతు ఆరని జ్యోతిలా నువ్వు
వెన్నెలవై వెలుగునిస్తావని, వేల్పువవుతావని నమ్మాను నేను
వర్షమై, వరదవై కన్నీళ్ళు మిగిల్చావు నువ్వు
కలల లోకంలో నేను
కలల లొకమే నువ్వు
కన్నీళ్ళు కార్చింది నేను
కన్నీళ్ళలో కరిగింది నువ్వు
No comments:
Post a Comment