మళ్ళీ దేశం వెళుతున్నందుకు చాల సంతోషంగ ఉంది. చాలా రోజుల తరువాత మళ్ళీ ఆనందం వెల్లి విరిసింది. ఒక ఖైదిని బెయిలు పైన కొన్నాళ్ళు విడుదల చేసినంత ఆనందం. ఇదంతా తాత్కాలికమే అని తెలిసిన, తెలియనట్టుగానే ఆనందపడుతున్నాను. కొన్ని నిజాలు తెలియకపోతేనే మంచిది.
నేను 8 నేలల క్రితమే దేశం వెళ్ళాను. కాని ఈ 8 నెలలు చాల క్లిష్టంగా గడిచాయి. మనసులో నిండిన ఙ్ఞాపకాలు మోయలేనంత బరువయ్యాయి. నాలో ఉత్సాహాన్ని నింపే ఙ్ఞాపకాలు నన్ను పీఢకలలా వేధించాయి. మర్చిపొవాలంటే భయం, గుర్తుతెచ్చుకొవాలంటే భయం. ఇక వేరే దారిలేక నాఫోను పైన భారం వేయాల్సి వచ్చింది. నేను ఇంటికి రెండు గంటల దూరంలొ ఉన్న నాలుగేళ్ళలో కూడ మాట్లాడనంత సేపు గత 8 నెలలలో మాట్లాడాను. ఒక గొప్ప వ్యక్తి అన్నట్టుగా దూరం అంటే సాగదీసిన సాన్నిహిత్యమే. కాని దూరం అవుతే తప్ప తెలుసుకోలేని విలువకు నిజంగా విలువ ఉందా? అల తెలుసుకొన్న విలువకు వెల కట్టెదెలా? పోని ఈ దూరానికి కారణం ఆ విలువకు సరితూగగలదా? నా దృష్టిలో మాత్రం ముమ్మాటికి కాదు, సరితూగలేదు.

ఇక్కడ అత్యంత బాధకరమైన విషయం ఎంటంటే నిజాలు తెలిసి నిమ్మకు నీరెత్తినట్టు బ్రతుకుతున్నాను. నెమ్మదిగ నన్ను నేను మోసం చేసుకొవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు నాలోని నేను నన్ను నిలదీసి అడుగుదామనుకొంటే, నాకు తెలియక నేనే నా నుంచి కనుమరుగువుతున్నాను. ఇంతకు ముందు అన్నట్టు కొన్ని నిజాలు తెలియనట్టు ఉంటెనే ఆనందం. ఇంక ఎన్నాళ్ళు ఇలా? ఎమో, అది తెలిస్తే, ఇంత బాధ ఉండకపొయేది. ఇప్పుడు తెలిసిందల్లా, నా దేశ ప్రయాణం. అది ఎన్నాళ్ళు అని అలోచించక, ఆనందానికి అవధులు లేవనుకొని గడపాలన్నదే నా ఆశ.
No comments:
Post a Comment